మహేశ్ బాబు సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్?

Vidyabalan considered for Maheshbabu movie
  • పాన్ ఇండియా మూవీగా 'సర్కారు వారి పాట'
  • ఇప్పటికే విలన్ పాత్రకు అనిల్ కపూర్ ఎంపిక
  • కీలక పాత్ర కోసం విద్యాబాలన్ తో సంప్రదింపులు
  • డెట్రాయిట్ లో 45 రోజుల తొలి షెడ్యూలు
టాలీవుడ్ సినిమా మార్కెట్ విస్తృతం కావడంతో ఇప్పుడు మన స్టార్ హీరోలంతా తమ తమ సినిమాలను పాన్ ఇండియా మూవీలుగా నిర్మించడానికి ప్లాన్లు వేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి మన సినిమాలకు మంచి ఆఫర్లు వస్తుండడంతో మన చిత్రాలను మరింత క్వాలిటీతో నిర్మించడానికి బడ్జెట్టును బాగా పెంచుతున్నారు. దీంతో సినిమాలోని కొన్ని కీలక పాత్రలకు భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తూ, బాలీవుడ్ తారలను బుక్ చేయడానికి కూడా నిర్మాతలు వెనుకాడడం లేదు.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'ను కూడా పాన్ ఇండియా మూవీగా నిర్మించే యోచన చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విలన్ పాత్రకు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ని తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇక సినిమాలో మరో కీలక పాత్ర కోసం ప్రముఖ నటి విద్యాబాలన్ తో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమా చేయడానికి సానుకూలంగా వున్నట్టు సమాచారం.

ఇక చిత్రం షూటింగ్ విషయానికి వస్తే, తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించడానికి నిర్ణయించారు. త్వరలోనే చిత్ర దర్శకుడు, కెమేరామేన్ కలసి లొకేషన్ల ఎంపికకు డెట్రాయిట్ వెళతారని అంటున్నారు. అక్కడ 45 రోజుల పాటు షూటింగును నిర్వహిస్తారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అక్కడ షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
Vidyabalan
Mahesh Babu
Keerti Suresh
Parashuram

More Telugu News