Ravi Kishna: జయాబచ్చన్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన 'రేసుగుర్రం' విలన్!

Ravi Kishans response on Jaya Bachchans comments
  • పార్లమెంటులో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై రచ్చ
  • సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నారన్న రవికిషన్
  • పరిశ్రమను కాపాడుకోవాలని హితవు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ డ్రగ్స్ మత్తులో జోగుతోందని సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ నిన్న లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును కుదిపేశాయి. ఈ వ్యాఖ్యలపై అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ నేడు రాజ్యసభలో మాట్లాడుతూ, రవికిషన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కొందరు చేసిన తప్పులను సినీపరిశ్రమ మొత్తానికి ఆపాదించడం సరికాదని ఆమె అన్నారు. సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

జయ వ్యాఖ్యలపై రవికిషన్ అదే స్థాయిలో పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. తన అభిప్రాయాన్ని జయాబచ్చన్ గౌరవించాలని చెప్పారు. తాను ఒక ప్రీస్ట్ కుమారుడినని... ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగానని, దాదాపు 600 సినిమాలకు పని చేశానని అన్నారు. తన అభిప్రాయాలకు జయ మద్దతు ఇస్తారని భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్న వారి గురించి తాను మాట్లాడానని తెలిపారు. పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. రవికిషన్ భోజ్ పురి సూపర్ స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తెలుగులో 'రేసుగుర్రం' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. 
Ravi Kishna
Bhojpuri
Jaya Bachchan
Boyapati Sreenu
Drugs
Parliament

More Telugu News