Anil Kumar Yadav: సీబీఐ విచారణను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా?: ఏపీ మంత్రి అనిల్ యాదవ్

Can NCB write a letter to CBI questions Anil KUMAR yadav
  • అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
  • ఫైబర్ గ్రిడ్ లో సైతం అవినీతి జరిగింది 
  • చంద్రబాబు ఎందుకు భయపడుతున్నా
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూకుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఏసీబీ కేసును నమోదుచేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ,  ఈ కుంభకోణంపై సీబీఐ విచారణను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.

సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు తాము కూడా సహకరిస్తామని చంద్రబాబు లేఖ రాయగలరా? అని ప్రశ్నించారు. అమరావతిలో అక్రమాలు జరగకపోతే... చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఫైబర్ గ్రిడ్ లో సైతం భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది పంటలు పండాయని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిందని... కానీ, చంద్రబాబు జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
Anil Kumar Yadav
YSRCP
Chandrababu
Telugudesam
Amaravati
Fiber Grid

More Telugu News