అనుష్కశర్మ బేబీ బంప్ పై ఎబ్బెట్టుగా మాట్లాడిన జర్నలిస్ట్... తీవ్రంగా మండిపడిన డైరెక్టర్ మారుతి!

Tue, Sep 15, 2020, 12:27 PM
Director Matuti Angry Over Lady Journalist Comments on Anushka Sharma
  • త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క దంపతులు
  • తల్లిని మాత్రమే చేశాడుగానీ, ఇంగ్లండ్ కు రాణిని కాదన్న మహిళా జర్నలిస్ట్
  • తల్లి కావడమే ఎక్కువ సంతోషాన్నిస్తుందన్న మారుతి
విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అనుష్క, తన బేబీ బంప్ ను చూపిస్తూ, తాను తల్లిని కాబోతున్నానన్న ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది. ఈ ఫోటోపై ఓ మహిళా జర్నలిస్టు వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. "అంతగా మిడిసిపడకు. అతను మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ కు మహారాణిని ఏమీ చేయలేదు" అని వ్యాఖ్యానించారు.

ఇక, ఈ కామెంట్ చూసిన దర్శకుడు మారుతి తీవ్రంగా మండిపడ్డారు. "చాలా విచారకరమైన స్పందన. అది కూడా ఓ మహిళా జర్నలిస్ట్ నుంచి... ఓ మహిళ ఇంగ్లండ్ మహారాణి కావడం కన్నా, బిడ్డకు తల్లి కావడమే సంతోషకరం. అనుష్క సెలబ్రిటీ కావడానికన్నా ముందే ఓ యువతి. తల్లి కాబోతున్న క్షణాలను ప్రతి క్షణం ఆహ్వానించే హక్కు ఆమెకు ఉంది" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha