నటసింహాన్ని పవర్ స్టార్ కలిసిన వేళ... నాగబాబు పోస్ట్ చేసిన పాత పిక్ వైరల్!
Add ap7am to your home Screen

నటసింహాన్ని పవర్ స్టార్ కలిసిన వేళ... నాగబాబు పోస్ట్ చేసిన పాత పిక్ వైరల్!

When Power Star Meet Nandamuri Lion
  • పాత పిక్ ను పోస్ట్ చేసిన నాగబాబు
  • ఇద్దరు సోదరులు కలిసిన రోజని కామెంట్
  • వైరల్ చేస్తున్న నందమూరి, మెగా ఫ్యాన్స్
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతూ, తన దృష్టికి వచ్చిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకునే నాగబాబు, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది ఓ పాత ఫోటో... దీనిలో బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఉన్నారు. ఏదో చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా దీన్ని తీసినట్టు తెలుస్తోంది.

ఇక దీనికి క్యాప్షన్ గా "నా ఇద్దరు సోదరులు కలిసిన ఓ రోజు. మొదటి వ్యక్తి నా సోదరుడు, రెండో వ్యక్తి మరో సోదరుడు. నందమూరి సింహాన్ని పవర్ స్టార్ కలిసిన రోజు" అని కామెంట్ పెట్టారు. ఈ పిక్ ను అటు నందమూరి అభిమానులు, ఇటు మెగాభిమానులు వైరల్ చేస్తున్నారు.
Nagababu
Balakrishna
Pawan Kalyan
Old Pic

More Telugu News