Santosh Gangwar: లాక్ డౌన్ సమయంలో పీఎఫ్ నుంచి వేల కోట్ల నగదు విత్ డ్రా చేసుకున్న ఉద్యోగులు!: కేంద్ర మంత్రి

  • రూ. 39 వేల కోట్లకు పైగా విత్ డ్రా
  • ఉద్యోగుల సంక్షేమం కోసం పలు చర్యలు
  • పార్లమెంట్ లో గాంగ్వార్ లిఖిత పూర్వక సమాధానం
Thousand Crores Withdraw by employees in Lockdown

మార్చిలో లాక్ డౌన్ మొదలైన తరువాత, ఆగస్టు 31 వరకూ తమ భవిష్యనిధిని దాచుకున్న ఉద్యోగులు పెద్దఎత్తున నగదు విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన కేంద్ర కార్మిక మంత్రి సంతోశ్ గాంగ్వార్, మార్చి 25 నుంచి ఆగస్టు నెలాఖరు వరకూ రూ. 39,402.90 కోట్లను ఉద్యోగులు విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్ కు లిఖిత పూర్వక సమాధానాన్ని పంపించారు.

ఈ ఐదు నెలల వ్యవధిలో మహారాష్ట్రకు చెందిన ఉద్యోగులు అత్యధికంగా నగదును తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి రూ. 7,837.80 కోట్లు విత్ డ్రా కాగా, ఆ తరువాత కర్ణాటక నుంచి రూ.5,743.90 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 4,984.50 కోట్లు విత్ డ్రా అయ్యాయని వెల్లడించారు.

కరోనా కాలంలో కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీల కోసం కేంద్రం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన, ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ ల ద్వారా పలు కార్యక్రమాలను రూపొందించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా నెలకు రూ. 15 వేల కన్నా తక్కువ వేతనం పొందుతున్నవారు లబ్దిని పొందారని తెలిపారు. మే నుంచి జూలైవరకూ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ను కూడా 12 నుంచి 10 శాతానికి తగ్గించామని సంతోశ్ గాంగ్వార్ వెల్లడించారు. లాక్ డౌన్ లో ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్రం అన్ని చర్యలూ తీసుకుందని తెలిపారు.

More Telugu News