నారా రోహిత్ కొత్త లుక్ అదిరిందిగా!

14-09-2020 Mon 20:58
  • కొత్త లుక్కులపై కసరత్తు చేస్తున్న హీరోలు 
  • త్వరలో నారా రోహిత్ భారీ బడ్జెట్ సినిమా
  • కొత్త లుక్కును ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్న వైనం  
Nara Rohith new look goes viral
ఇటీవలి కాలంలో మన హీరోలు ప్రతి సినిమాకూ ప్రేక్షకులకు కొత్తగా కనపడాలని తహతహలాడుతున్నారు. అందుకే, ఆయా పాత్రలను బట్టి లుక్ విషయంలో చాలా ట్రైల్స్ వేస్తుంటారు. పలు లుక్స్ ట్రై చేసి, చివరికి కొత్తగా అనిపించిన దానిని ఫైనల్ చేసుకుంటారు. ఈ క్రమంలో లుక్ కోసం పెద్ద కసరత్తే చేస్తారని చెప్పాలి. తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ కూడా తన కొత్త సినిమా కోసం అలాగే కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ రోజు తన ట్విట్టర్ అకౌంటుకి ఓ కొత్త లుక్కును ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. పొడవాటి గెడ్డం .. మీసాలతో తీక్షణంగా చూస్తున్న రోహిత్ లుక్ ఇట్టే ఆకట్టుకుంటోంది. త్వరలో తాను ఓ భారీ బడ్జెట్టు చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం కోసమే ఈ లుక్ ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఈ లుక్ ప్రస్తుతం షోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

వాస్తవానికి రోహిత్ కు కెరీర్ పరంగా చాలా గ్యాప్ వచ్చింది. రెండేళ్ల క్రితం వచ్చిన 'వీర భోగ వసంతరాయలు' చిత్రం తర్వాత మరో సినిమా రాలేదు. ఇప్పటివరకు చేసిన సినిమాల ద్వారా మంచి నటుడిగా నిరూపించుకున్నప్పటికీ, ఇంకా అతని సత్తాను పూర్తి స్థాయిలో నిరూపించుకునే సినిమా మాత్రం పడలేదనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి సినిమా కోసమే తను ట్రై చేస్తున్నట్టు చెబుతున్నారు.