నకిలీ చెక్కులతో రామ జన్మభూమి ట్రస్టు ఖాతా నుంచి రూ.6 లక్షలు డ్రా... వెంటనే స్పందించిన ఎస్బీఐ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ట్రస్టు కార్యదర్శి
- లక్నోలోని పీఎన్బీ బ్రాంచిలో లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు
- వెంటనే రూ.6 లక్షలను తిరిగి ట్రస్టు ఖాతాలో జమచేసిన ఎస్బీఐ
ఈ విషయంపై సమాచారం అందుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెంటనే స్పందించింది. ఈ చెక్కులను లక్నోలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచిలో మార్చినట్టు గుర్తించడమే కాకుండా, ఆ రూ.6 లక్షలను తిరిగి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో జమచేసింది. దీనిపై స్పందించిన ట్రస్టు వర్గాలు ఎస్బీఐకి కృతజ్ఞతలు తెలిపాయి.