Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరే సమస్య ఇదే: కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు

This is the problem of Uddhav Thackeray says Kangana Ranaut
  • మూవీ మాఫియాను, డ్రగ్ రాకెట్ ను నేను ఎక్స్ పోజ్ చేశాను
  • థాకరే ముద్దుల కొడుకు వారికి స్నేహితుడు
  • ఎవరు ఎవరిని ఫిక్స్ చేస్తారో చూద్దాం
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, బాలీవుడ్ ప్రపంచాన్ని ఇరుకున పెట్టిన హీరోయిన్ కంగనా రనౌత్ ముంబైని వీడి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ముంబై నుంచి తాను సురక్షితంగా బయటపడటం అదృష్టమని చండీగఢ్ చేరుకున్న తర్వాత ఆమె ట్వీట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ ద్వారా మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ని టార్గెట్ చేశారు.

తాను మూవీ మాఫియాను, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హత్య చేసిన వారిని, డ్రగ్ రాకెట్ ను ఎక్స్ పోజ్ చేయడమే ఉద్ధవ్ థాకరేకు అసలు సమస్య అని చెప్పారు. ఉద్ధవ్ ముద్దుల కొడుకు ఆదిత్య థాకరే వీరందరితో స్నేహంగా ఉంటాడని ఆరోపించారు. వారితో ఎక్కువగా గడుపుతుంటాడని వెల్లడించింది. ఇదే తాను చేసిన పెద్ద నేరమని చెప్పింది. తనను ప్రభుత్వం ఫిక్స్ చేస్తుందో? లేక ప్రభుత్వాన్ని తాను ఫిక్స్ చేస్తానో? చూద్దామని అన్నారు. మరోవైపు, కంగనా రనౌత్ కు బీజేపీ మద్దతు పలుకుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి వారు మహా ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.
Uddhav Thackeray
Shiv Sena
Kangana Ranaut
Bollywood

More Telugu News