బాలయ్య సినిమాలో ప్రధాన పాత్ర కోసం యువ హీరో ఎంపిక!

Mon, Sep 14, 2020, 01:15 PM
Allari Naresh is selected for an important character in Balakrishna movie
  • బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో చిత్రం
  • ప్రధాన పాత్ర కోసం అల్లరి నరేశ్ ఎంపిక
  • బాలయ్య సరసన నటిస్తున్న అంజలి
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'లెజెండ్', 'సింహా' సినిమాలు ఘన విజయం సాధించాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అఘోరా, ఫ్యాక్షనిస్టు పాత్రల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

మరోవైపు సినిమాలో ఓ ప్రధాన పాత్రలో ఒక యంగ్ హీరో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండటంతో పలువురు హీరోల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలించారు. చివరకు అల్లరి నరేశ్ ను ఆ పాత్రకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి కథానాయికగా నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement