వైఎస్ జగన్ బయోపిక్ 'యాత్ర-2'లో హీరోగా నాగార్జున!

Mon, Sep 14, 2020, 09:47 AM
Nagarjuna Accenpted Jagan Charectro in Yatra part 2
  • వైఎస్ పాదయాత్ర ఆధారంగా 'యాత్ర'
  • దర్శకత్వం వహించిన మహీ రాఘవ
  • మహీ దర్శకత్వంలోనే 'యాత్ర-2'
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా మహీ వీ రాఘవ దర్శకత్వంలో 'యాత్ర' పేరిట బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకూ జరిగిన సంఘటనలతో 'యాత్ర-2' స్క్రిప్ట్ ను ఆయన సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.

ఇందులో జగన్ తెర జీవిత పాత్రను ప్రముఖ నటుడు నాగార్జున పోషించనున్నాడని సమాచారం. మహీ వీ రాఘవ చెప్పిన స్క్రిప్ట్ పై నమ్మకంతో నాగ్, ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో అధికారిక స్పందన వెలువడాల్సి వుంది. ఈ వార్తే నిజమై, నాగార్జున, తెరపై జగన్ పాత్రను పోషిస్తే, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha