Hizbul Mujahideen: రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక చస్తారా?: కశ్మీర్ నేతలకు హిజ్బుల్ బెదిరింపు లేఖ

  • రాజకీయాలకు దూరం జరిగి మాకు మద్దతివ్వండి
  • ఎర్రకోటపై దాడిచేసిన మాకు మిమ్మల్ని చంపడం లెక్క కాదు
  • ఇంటి కొచ్చి మరీ చంపుతాం.. జాగ్రత్త
Stay away from politics or face consequences Hizbul wirtes letter to J and K leaders

కశ్మీర్‌లో రాజకీయాలకు దూరం జరగాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని పేర్కొంటూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ పలువురు నేతలను ఆదేశించింది. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణ్ భల్లాకు రాసిన లేఖలో పలువురి పేర్లను ప్రస్తావించింది. అందులో బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రావిన్స్ స్థాయి అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రాణా, మాజీ మంత్రులు, ఆర్ఎస్ఎస్ నాయకుల పేర్ల సహా ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన 17 మంది నేతల పేర్లు ఉన్నాయి. ఈ లేఖపై హిజ్బుల్ డివిజినల్ కమాండ్ సంతకం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

రాజకీయాలకు అందరూ దూరంగా ఉండి తమకు మద్దుతు తెలపాలని హిబ్బుల్ ఆ లేఖలో పేర్కొంది. లేదంటే డెత్ వారెంట్లు తప్పవని హెచ్చరించింది. తమ నుంచి ఎవరూ కాపాడలేరని తేల్చి చెప్పింది. అంతేకాదు, తమ టార్గెట్‌లోకి వచ్చిన వారిని వారి ఇళ్లలోనే కాల్చి చంపుతామని హెచ్చరికలు జారీ చేసింది. ఎర్రకోటపైనే దాడిచేసిన తమను మిమ్మల్ని హతమార్చడం పెద్ద లెక్క కాదని పేర్కొంది. కాగా, ఈ లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హిజ్బుల్ ఉగ్రవాద సంస్థపై ఉపా చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

More Telugu News