Corona Virus: కరోనా వైరస్‌ పుట్టుకపై చైనా వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు

  • వైరస్ ఓ ల్యాబ్‌లోనే పుట్టింది
  • డబ్ల్యూహెచ్ఓ, చైనాలు నా హెచ్చరికలను నిర్లక్ష్యం చేశాయి
  • నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి
coronavirus came from China lab china virologist

కరోనా వైరస్‌పై చైనాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ లీ మెగ్ యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా ఆరోపించినట్టుగానే, ఈ ప్రాణాంతక వైరస్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందని పేర్కొన్నారు. హాంకాంగ్‌ లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న లీ కరోనా వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. తాను న్యూమోనియాపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే ఈ వైరస్‌ చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారైనట్టు గుర్తించినట్టు చెప్పారు. ఆ ల్యాబ్ పూర్తిగా చైనా ప్రభుత్వ అధీనంలో ఉంటుందని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై తాను చేసిన హెచ్చరికలను చైనా కానీ, ప్రపంచ ఆరోగ్య  సంస్థ కానీ పట్టించుకోలేదని లీ ఆవేదన వ్యక్తం చేశారు. తన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందన్నారు. కరోనా వైరస్ చైనా ల్యాబ్‌లోనే పుట్టిందని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్న ఆమె.. చైనా అధికారుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే తాను చైనా నుంచి అమెరికాకు వచ్చేసినట్టు చెప్పారు. తన సమాచారం మొత్తాన్ని డిలీట్ చేశారని పేర్కొన్నారు. అయితే, లీ ఆరోపణలను వూహాన్‌లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ యువాన్ జిమింగ్ కొట్టిపడేశారు.

More Telugu News