Nara Lokesh: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే డ్యాన్సులు... కరోనా టైమ్ లో ఇదేంటని ప్రశ్నించిన నారా లోకేశ్

Nara Lokesh tweets a video about Srikalahasti MLA
  • వీడియో ట్వీట్ చేసిన లోకేశ్
  • మాస్కుల్లేవు, భౌతికదూరం లేదంటూ లోకేశ్ విమర్శలు
  • ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్లు అంటూ వ్యాఖ్యలు
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్ రెడ్డి డ్యాన్సులు చేస్తుండడాన్ని చూడొచ్చు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ, "మాస్కుల్లేవు, భౌతికదూరం లేదు... ఏపీలో ఇప్పటికీ 10 వేల కరోనా కేసులు వస్తున్న వేళ వైసీపీ ప్రజాప్రతినిధులు సిగ్గు లేకుండా కరోనా సూపర్ స్ప్రెడర్లుగా వ్యవహరిస్తున్నారు. విషాదం ఏంటంటే... శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్ రెడ్డికి గతంలో కరోనా పాజిటివ్  అని నిర్ధారణ అయింది. ఇప్పటికీ అతను దీన్నించి పాఠాలు నేర్చుకోలేదనిపిస్తోంది" అని లోకేశ్ ట్వీట్ చేశారు.

టీడీపీ నేతలు గత కొంతకాలంగా ఇదే విషయంలో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనేక కార్యక్రమాల్లో మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా వైసీపీ నేతలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని చంద్రబాబు తదితరులు ఆరోపణలు చేశారు.

Nara Lokesh
B.Madhusudan Reddy
Srikalahasti
MLA
YSRCP
Corona Virus

More Telugu News