Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పి తప్పుడు ఆడిషన్స్

Vijay Devarakonda Team clarifies on fake auditions
  • విజయ్ దేవరకొండ టీమ్ ప్రకటన
  • తప్పుడు ఆడిషన్స్ ను నమ్మవద్దని వెల్లడి
  • ఏదైనా ఉంటే విజయ్ నేరుగా ప్రకటిస్తాడన్న టీమ్
టాలీవుడ్ లో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న యువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. కొద్దికాలంలోనే స్టార్ డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ బ్రాండ్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే, విజయ్ పేరును ఉపయోగించుకుని కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు విజయ్ దేవరకొండ టీమ్ ఓ ప్రకటన చేసింది.

విజయ్ దేవరకొండతో తాము సినిమా తీయబోతున్నామని, ఆ సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నామని చెబుతూ కొన్ని నిర్మాణ సంస్థలు నటీనటులను సంప్రదిస్తున్నట్టు తెలిసిందని విజయ్ టీమ్ పేర్కొంది. ఇలాంటి ఆడిషన్స్ ను ఎవరూ నమ్మవద్దని, ఏదైనా అధికారిక సమాచారం ఉంటే విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడిస్తారని, లేకపోతే ఆ సినిమా నిర్మాత నేరుగా అనౌన్స్ చేస్తారని వివరించింది. ఇలాంటి తప్పుడు ఆడిషన్స్ కు సంబంధించిన ప్రకటనలు ఎవరూ నమ్మవద్దని, ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ... పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఫైటర్ చిత్రంలో నటిస్తున్నారు
Vijay Devarakonda
Auditions
Fake
Team
Tollywood

More Telugu News