Russia: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితం కాదు.. మా వ్యాక్సిన్ సురక్షితం: రష్యా

  • మీడియాతో మాట్లాడిన ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో
  • వ్యాక్సిన్‌ అభివృద్ధికి అవలంబిస్తున్న విధానంలో లోపాలు
  • కోతుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వాడుతున్నారు
  • మా స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ మాత్రం అందుకు భిన్నం
my country vaccine safe says russia

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్‌ ఆక్స్ ఫర్డ్ టీకాపైనే ప్రజలు ఆశలు పెంచుకున్న విషయం తెలిసిందే. అయితే, చివరి దశ ప్రయోగాల్లో క్లినికల్స్ ట్రయల్స్ వికటించడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాలను భారత్‌లో కూడా నిలిపి వేశారు. దీంతో ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యంతో రూపొందుతున్న ఆ ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ చివ‌రి ద‌శ ప్రయోగాలు తాత్కాలింగా నిలిచిపోయినప్పటికీ తిరిగి వాటిని పునఃప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

ఈ విషయంపై రష్యా స్పందిస్తూ తమ వ్యాక్సిన్‌  స్పుత్నిక్‌-వీ గురించి పలు విషయాలు తెలిపింది. ‌తాజాగా, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌( ఆర్‌డీఐఎఫ్‌) సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వ్యాక్సిన్‌ అభివృద్ధికి అవలంబిస్తున్న విధానంలో లోపాల్ని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఎత్తిచూపాయని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వాడాల్సి ఉంటుందని, అటువంటి దాన్ని అభివృద్ధి చేయడం కోసం పలు దేశాలు గతంలో పరీక్షించని విధానాల్ని అవలంబిస్తున్నాయని అభ్యంతరాలు తెలిపారు.

వ్యాక్సిన్‌ కోసం కోతుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వాడడంతో పాటు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను వినియోగించడం నూతన విధానాలన్నారు. అయినప్పటికీ, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తిరిగి ప్రారంభం కావడంపై పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.

అయితే, తాము తీసుకొస్తున్న స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ మాత్రం అందుకు భిన్నమని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో మానవుల అడినోవైరస్‌ వెక్టార్‌ను వాడామని, ఇది చాలా సురక్షితమని తెలిపారు. ఏడాదిలో తాము ప్రపంచంలోని 100 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్‌ను అందజేస్తామని చెప్పారు. తమ దేశం అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్లన్నీ అత్యంత సురక్షితమైనవని రుజువైందని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News