Payal Ghosh: గదిలోకి తీసుకెళ్లిన ఓ డైరెక్టర్ బ్లూ ఫిల్మ్ చూపించాడు... ఓ చానెల్ ఇంటర్వ్యూలో నటి పాయల్ ఘోష్ వ్యాఖ్యల వీడియో!

Actress Payal Ghosh Sensational Comments
  • డ్రగ్స్ వాడితే యాక్టివ్ గా ఉంటామని నటీనటులు భావిస్తారు
  • ఒంట్లో బాగాలేదని ఆ డైరెక్టర్ నుంచి తప్పించుకున్నా
  • డ్రగ్స్ వాడేవారంతా బానిసలు కాదన్న పాయల్
భారత చలనచిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న వేళ, నటి పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సినీ పరిశ్రమలో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని, వాటిని తీసుకుంటే తామెంతో చలాకీగా ఉంటామన్న అభిప్రాయం వారిలో ఉందని అన్నారు. అంతేకాదు, తాను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నానని ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆమె, ఓ డైరెక్టర్ ఈఆర్డీ రోడ్‌లో కలిసిన వేళ, గదిలోకి తీసుకెళ్లి, నీలి చిత్రాన్ని చూపించాడని, తాను ఏ హీరోయిన్ ను కలిసినా, ఇక్కడే ఎంజాయ్ చేస్తానని అతను చెప్పగా, తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది.

ఆపై మరే ఇతర డైరెక్టర్ నుంచి తనకు ఇదే విధమైన అనుభవం ఎదురు కాలేదని చెప్పిన పాయల్, డ్రగ్స్ ప్రస్తావన వస్తే, తాను దూరంగా ఉంటానని చెప్పింది. సుశాంత్ కొన్ని సంవత్సరాలుగా తనకు తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడని భావించడం లేదని తెలిపింది. గతంలో ఓ క్రికెటర్ తో డేటింగ్ చేశానని, అతనితో బ్రేకప్ తో తీవ్ర మానసిక వేధన అనుభవించానని, సుదీర్ఘకాలం పాటు చికిత్స తరువాత కోలుకున్నానని వ్యాఖ్యానించింది. చిత్ర పరిశ్రమలో చాలా మంది మాదకద్రవ్యాలు వాడుతున్నా, వారంతా బానిసలు కాదని, పరిస్థితులను చూసి అలవాటు పడుతున్నారని చెప్పుకొచ్చింది. పాయల్ వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.
Payal Ghosh
Drugs
Director
Blue Film

More Telugu News