USA: హిందూ మహాసముద్రంలో చైనాను నిలువరించేందుకు మాల్దీవులతో అమెరికా ఒప్పందం

  • హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు
  • మాల్దీవులతో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం
  • ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరుదేశాలు
US pact with Maldives to counter China movements in Indean Ocean area

గత కొంతకాలంగా హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరిగాయి. దీనిపై అమెరికా ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అమెరికానే కాదు, హిందూ మహాసముద్రంపై గట్టి పట్టున్న భారత్ కూడా చైనా తీరును తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా... హిందూ మహాసముద్రంలోని మాల్దీవులతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబరు 10న ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ సమావేశంలో అమెరికా, మాల్దీవుల ప్రభుత్వ వర్గాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

రక్షణ రంగంలో ప్రగాఢ సహకారం అందించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంతో హిందూ మహాసముద్రంలో శాంతి, భద్రత ఏర్పడతాయని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బలమైన భాగస్వామ్యాలు ఏర్పరచుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని వివరించింది.

More Telugu News