Janga Gowtham: విజయసాయిరెడ్డి మొత్తం చెప్పేసిన తర్వాత.. సీబీఐ విచారణ ఎందుకు?: ఏపీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్

CBI has to investigae Vijayasai Reddy says Janga Gowtham
  • రథం దగ్ధం వెనుక చంద్రబాబు ఉన్నారని విజయసాయి చెప్పారు
  • ఆధారాలు చూపకపోతే విజయసాయి రాజీనామా చేయాలి
  • విజయసాయిని సీబీఐ విచారించాలి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ మండిపడ్డారు. అంతర్వేది రథం దగ్ధం కావడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని విజయసాయిరెడ్డి తేల్చేశారని... అలాంటప్పుడు ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇచ్చారో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు విజయసాయి ఆధారాలు చూపకపోతే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రథం దగ్ధం కేసులో సీబీఐని తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన విజయసాయిని అరెస్ట్ చేసి, శిక్షించాలని అన్నారు. విజయసాయిని సీబీఐ విచారించాలని... ఆయన వద్ద ఉన్న ఆధారాలను స్వీకరించాలని కోరారు.
Janga Gowtham
Congress
Chandrababu
Telugudesam
Vijayasai Reddy
Jagan
YSRCP
Antarvedi

More Telugu News