అంతర్వేది ఘటనలో హైదరాబాద్, గుంటూరు వ్యక్తుల ప్రమేయం ఉంది: విజయసాయిరెడ్డి
- రాజకీయ దుమారం రేపుతున్న అంతర్వేది ఘటన
- బాబు హస్తం ఉందంటున్న విజయసాయిరెడ్డి
- హైదరాబాదులో ఉంటూ ఏపీలో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపణ
ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేత బాబు, ఆయన అనుచరగణం కుట్ర ఉందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక పెదబాబు, చినబాబు హస్తం ఉందన్న విషయం విచారణలో బయటపడుతుందని తెలిపారు. బాబు హైదరాబాదులో ఉంటూ ఏపీలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ట్విట్టర్ లోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రం... మళ్లీ దళిత రాజకీయం మొదలుపెట్టావా? అంటూ విమర్శించారు. సీఎం జగన్ శ్రీకారం చుట్టిన వైఎస్సార్ ఆసరా నుంచి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కాదా అని నిలదీశారు. కానీ మీ కుట్ర విఫలం... వైఎస్సార్ ఆసరా సఫలం అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మళ్లీ వినండి... మాట నిలబెట్టుకుంటూ సీఎం జగన్ తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశారని వెల్లడించారు.