Chandrababu: విగ్రహాలను ధ్వంసం చేసి.. ఆయన ఆనవాళ్లను పెకిలించలేరు: చంద్రబాబు

Chandrababu fires on NTRs statue demolition
  • పోలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం
  • ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్న చంద్రబాబు
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన పట్ల టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా చంద్రబాబు స్పందిస్తూ... ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలకు మన దేశంలోనే కాకుండా, ప్రపంచ నలుమూలలా గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆయన ఆనవాళ్లను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని, రాక్షస చర్య అని మండిపడ్డారు.
Chandrababu
NTR
Telugudesam
Statue

More Telugu News