Payal Rajputh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Payal dubs her self first time for a movie
  • పాయల్ రాజ్ పుత్ కల నెరవేరిందట!
  • అఖిల్ సినిమా కోసం రష్మిక?
  • సాయితేజ్ సినిమా పూర్తయింది
*  అందాలతార పాయల్ రాజ్ పుత్ తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతున్న 'నరేంద్ర' అనే సినిమాలో ఈ చిన్నది కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి సంబంధించిన డబ్బింగును తాజాగా పూర్తిచేస్తూ, 'తెలుగులో డబ్బింగ్ చెప్పాలనేది నా  కోరిక, అది ఈ సినిమాతో నెరవేరింది' అంటూ పాయల్ పోస్ట్ పెట్టింది.
*  అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక నటించే అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
*  సాయితేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం షూటింగ్ ముగిసింది. ఇటీవల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలతో మొత్తం పూర్తయిందని యూనిట్ తెలిపింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. ఇందులో నభా నటేష్ కథానాయికగా నటించింది.  
Payal Rajputh
Akhil Akkineni
Rashmika Mandanna
Saitej

More Telugu News