COVAXIN: జంతువులపై కోవాగ్జిన్ పనితీరు అద్భుతం: భారత్ బయోటెక్

  • రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న కోవాగ్జిన్
  • కోవాగ్జిన్ ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్
  • జంతువుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వలేదన్న సంస్థ
Bharat Biotech said Covaxin gives good results on animals

భారత్ లో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంస్థలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ముందంజలో ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. జంతువులపై కోవాగ్జిన్ ప్రయోగ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, తమ వ్యాక్సిన్ తో జంతువుల్లో ఎలాంటి దుష్ఫలితాలు కలగలేదని తెలిపింది.

వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత 14 రోజుల పాటు వాటిని పర్యవేక్షించగా, వాటిలో ముక్కు, ఊపిరితిత్తులు, గొంతులో కరోనా క్రిముల వృద్ధిని వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకున్నట్టు గుర్తించామని భారత్ బయోటెక్ వివరించింది. పైగా జంతువుల్లో ఇమ్యూనిటీ కూడా ప్రభావవంతమైన రీతిలో ఇనుమడించిందని వెల్లడించింది.

కాగా, ప్రపంచస్థాయిలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్న ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ఓ వ్యక్తిలో దుష్ఫలితాలను చూపడం తెలిసిందే. దాంతో ప్రపంచవ్యాప్తంగా తన క్లినికల్ ట్రయల్స్ ను ఆక్స్ ఫర్డ్ వర్సిటీ నిలిపివేసింది. అదే సమయంలో భారత్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలను ఇస్తూ మరింత ఆశాజనకంగా ముందుకు సాగిపోతోంది.

More Telugu News