Roja: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉంది: రోజా

Chandrababu is behind Antarvedi incident says Roja
  • రైలు, రాజధాని భూములు తగలబెట్టించిన ఘనత చంద్రబాబుది
  • ఏపీకి సీబీఐ రాకూడదని గతంలో చంద్రబాబు జీవో ఇచ్చారు
  • ఇప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు
అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తుండగా... టీడీపీపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, రథం తగలబడిన ఘటన వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపించారు. గతంలో కూడా రైలును తగలబెట్టించడం, రాజధాని భూములను తగబెట్టించడం వంటివి చంద్రబాబు చేశారని విమర్శించారు.

సీబీఐ ఏపీకి రాకూడదని జీవో ఇచ్చిన చంద్రబాబు... ఇప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. వైసీపీ ఎలాంటి తప్పులు చేయదని... అందుకే తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు జగన్ ఆదేశించారని చెప్పారు.
Roja
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Antarvedi

More Telugu News