Hardhik Pandya: హార్దిక్ పాండ్యా ఈ సీజన్ లో రాణించడం కష్టమే: రమీజ్ రాజా

  • యూఏఈ పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి
  • హార్డ్ హిట్టర్లు రాణించడం కష్టమే
  • పాండ్యా బాగా ఆడినా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటాడు
Not so easy for Hardhik Pandya to perform in this season says Rameez Raja

ఈ ఐపీఎల్ సీజన్ యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు, కామెంటేటర్ రమీజ్ రాజా ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఈ సీజన్ లో బిగ్ హిట్టర్లు రాణించలేరని చెప్పారు. యూఏఈ పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయని అన్నారు. ఈ పిచ్ లపై హార్డ్ హిట్టర్లైన పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రిస్ లిన్ వంటి వారు రాణించడం చాలా కష్టమని అంచనా వేశాడు. స్పిన్ ను పాండ్యా బాగా ఆడినా, కొంత వరకు ఇబ్బందిని ఎదుర్కొంటాడని చెప్పాడు. ఈ 13వ సీజన్ లో స్పిన్నర్లు పైచేయి సాధించడం ఖాయమని  తెలిపారు.

హోం గ్రౌండ్లలో తమ అభిమానుల మధ్య కొన్ని జట్లు రెచ్చిపోతాయని... ఈ సీజన్ లో స్టేడియంలో ప్రేక్షకులు ఉండకపోవడం ఒక మైనస్ పాయింట్ అని రమీజ్ చెప్పారు. ఈ నెల 19న ఐపీఎల్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

More Telugu News