Lottery: దుబాయ్ లాటరీలో తెలంగాణ ఐటీ ఇంజినీర్ కు బంపర్ ప్రైజ్!

  • రూ.7.3 కోట్ల లాటరీ దక్కించుకున్న తాతారావు
  • దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం 
  • తన కుటుంబం పరిస్థితి మారిపోతుందంటున్న తెలంగాణ టెక్కీ
Telagana techie gets bumper prize in Dubai lottery

గల్ఫ్ దేశాల్లో విమానం దిగీ దిగగానే ఎయిర్ పోర్టులో లాటరీ టికెట్లు ఊరిస్తుంటాయి. వాటి రేటు ఎక్కువే అయినా లాటరీల పిచ్చి ఉన్నవాళ్లు తప్పక కొంటుంటారు. సరిగ్గా చెప్పాలంటే భారతీయులే ఈ లాటరీలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు మనవాళ్లు ప్రైజులు కూడా భారీగానే అందుకున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరు ఏకంగా రూ.7.3 కోట్లు కొల్లగొట్టాడు. లక్కీడ్రాలో మనవాడు కొనుగోలు చేసిన లాటరీ నెంబరుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.

లాటరీ కొట్టిన ఆ వ్యక్తి పేరు గ్రంథి వెంకట లక్ష్మీతాతారావు. 37 ఏళ్ల తాతారావు దుబాయ్ లోని ఓ ఐటీ సంస్థలో ఏడాదిగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తనకే మొదటి బహుమతి రావడంతో తాతారావు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ లాటరీ మొత్తంతో భారత్ లో ఉన్న తన కుటుంబం పరిస్థితి మారిపోతుందని ఆనందంగా చెప్పాడు.

కాగా, యూఏఈలో 1999లో మిలినీయం మిలియనర్ ప్రమోషన్ లాటరీ ప్రారంభం కాగా, తాతారావు సహా 168 మంది భారతీయులు ఈ లాటరీ గెలుచుకోవడం విశేషం అని చెప్పాలి.

More Telugu News