Raghavendra Rao: నేహా... ఐపీఎల్ లో నీ యాంకరింగ్ ద్వారా తెలుగువాళ్లకు మరింత దగ్గరవ్వాలి: కె.రాఘవేంద్రరావు విషెస్

Senior director K Raghavendra Rao gives his blessings to anchor Neha Chowdary who selected for IPL as an anchor
  • ఐపీఎల్ లో యాంకరింగ్ చేయనున్న నేహా
  • శుభాకాంక్షలు తెలిపిన దర్శకేంద్రుడు
  • సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్
  • స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్షప్రసారం
క్రీడా నేపథ్యం నుంచి వచ్చి తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నేహా చౌదరి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో యాంకరింగ్ చేయబోతోంది. కొంతకాలంగా తెలుగులోనూ వ్యాఖ్యానం వినిపిస్తున్న ఐపీఎల్ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తెలుగు బృందంలో నేహాకు కూడా చోటుదక్కింది.

ఈ నేపథ్యంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బబ్లీ యాంకర్ నేహా చౌదరికి తన దీవెనలు అందజేశారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.  "నేహా చౌదరీ... జిమ్నాస్టిక్స్ లో ఎన్నో మెడల్స్ సాధించావు. రాబోయే ఐపీఎల్ తో నీ యాంకరింగ్ ద్వారా తెలుగు వారందరికీ మరింత దగ్గరవ్వాలని ఆశీర్వదిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

నేహా చౌదరి రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ కూడా. అయితే వినోద రంగంపై ఆసక్తితో ఆమె యాంకర్ గా కెరీర్ ప్రారంభించి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ప్రతిభకు తగ్గట్టుగానే కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ స్వాగతం పలికింది. ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం కానున్నాయి.
Raghavendra Rao
Neha Chowdary
Anchor
IPL 2020
Star Sports

More Telugu News