TV Actress: టీవీ నటి శ్రావణితో 'ఆర్ఎక్స్ 100' నిర్మాత అశోక్ ‌రెడ్డి ఫోన్ సంభాషణ వైరల్

RX 100 producer name in the TV Actress Sravani suicide case
  • రోజుకో మలుపు తిరుగుతున్న శ్రావణి ఆత్మహత్య కేసు
  • నిర్మాత అశోక్‌రెడ్డితో దగ్గరి సంబంధం ఉన్నట్టు చెబుతున్న ఫోన్ సంభాషణ
  • నటి ఆత్మహత్యకు అశోక్‌రెడ్డే కారణమంటున్న దేవరాజ్
సీరియల్ నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రావణి కేసులో ఇప్పటికే దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తుండగా, తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత గుమ్మకొండ అశోక్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. శ్రావణితో అశోక్‌రెడ్డి ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ సంభాషణను బట్టి ఇద్దరి మధ్య దగ్గరి పరిచయం ఉన్నట్టు అర్థమవుతోంది. మరోవైపు, శ్రావణి ఆత్మహత్యకు సాయికృష్ణారెడ్డితోపాటు అశోక్‌రెడ్డి కూడా కారణమని పోలీసులకు లొంగిపోయిన దేవరాజ్ ఆరోపిస్తున్నాడు. అయితే, శ్రావణి కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తె ఆత్మహత్యకు దేవరాజే కారణమని, డబ్బుల కోసం ఆమెను వేధించాడని ఆరోపిస్తున్నారు.

ఇక, దేవరాజ్ విషయానికొస్తే అతడో ప్లేబోయ్ అని, అతడిది కాకినాడ అని పోలీసులు పేర్కొన్నారు. టిక్‌టాక్ వేదికగా ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని పేర్కొన్నారు. తనతోపాటు మరికొందరు అమ్మాయిలతోనూ దేవరాజ్ సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించిన శ్రావణి అతడిని దూరం పెట్టిందని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని చెబుతున్నారు. శ్రావణి ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
TV Actress
Sravani
Ashok Reddy
Devaraj
Saikrishna reddy

More Telugu News