Congress: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం.. బెంగాల్ చీఫ్‌గా అధీర్ రంజన్ నియామకం

Congress Bengal president pick sends clear message to Mamata Banerjee
  • అధీర్ నియామకంతో తృణమూల్‌కు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్ 
  • వచ్చీ రావడంతోనే తృణమూల్, బీజేపీపై విరుచుకుపడిన అధీర్
  • అవసరమైతే వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకుంటామని ప్రకటన
అసెంబ్లీ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అస్సలు గిట్టని పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరిని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా నియమించింది. దీంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బాధ్యతలు చేపట్టీ చేపట్టడంతోనే అధీర్ రంజన్ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మతతత్వ బీజేపీ, తృణమూల్‌ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. అవసరమైతే వామపక్షాలతోనూ పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు అధీర్ సంచలన ప్రకటన చేశారు. అధీర్ రాకతో బెంగాల్ కాంగ్రెస్‌లో జోష్ పెరిగిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
Congress
West Bengal
Adhir Ranjan Chowdhury
Trinamool Congress
Mamata Banerjee

More Telugu News