Indian Railways: కొత్త రైళ్లకు ప్రారంభమైన రిజర్వేషన్ ప్రక్రియ.. రేపటి నుంచి మొదలు కానున్న కూత!

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు
  • ఇప్పటికే నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా 80 కొత్త రైళ్లు
  • ఆయా రాష్ట్రాల అభ్యర్థనను బట్టి స్టాపులు
Reservation for new trains resumed

అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ఇటీవల ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లకు నిన్నటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఈ రైళ్లు కూత పెట్టనున్నాయి. ఇప్పటికే నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లకు ఇవి అదనమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

కొత్త రైళ్ల వేళలు రెగ్యులర్ రైళ్లలానే ఉంటాయని భారతీయ రైల్వే తొలి సీఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వీకే యాదవ్ తెలిపారు. స్టాపులు మాత్రం ఆయా రాష్ట్రాల అభ్యర్థనను అనుసరించి ఉంటాయని పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచిపోయాయి.

దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీలను స్వగ్రామాలకు తరలించేందుకు మే నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇక కొత్తగా ప్రకటించిన రైళ్లలో కొన్నింటిని ఢిల్లీ-ఇండోర్, యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్, పూరి-అహ్మదాబాద్, న్యూఢిల్లీ-బెంగళూరు రూట్లలో చేర్చారు. 

More Telugu News