సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

11-09-2020 Fri 07:30
  • రజనీ సినిమా షూటింగులో కీర్తి సురేశ్ 
  • పాన్ ఇండియా సినిమాగా 'సర్కారు వారి పాట'
  • జిమ్ లో చెమటోడుస్తున్న యంగ్ హీరో 
Keerti Suresh Joins Rajanikanths film shoot
*  ఓపక్క కరోనా విస్తృతి ఇంకా తగ్గనప్పటికీ, కొంతమంది కథానాయికలు మాత్రం ధైర్యంగా షూటింగులలో పాల్గొంటున్నారు. కీర్తి సురేశ్ కూడా అలాగే ఇటీవల 'గుడ్ లక్ సఖి' చిత్రం షూటింగులో పాల్గొని, అది పూర్తిచేసింది. ఇక రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగులో కూడా త్వరలో కీర్తి పాల్గొంటుందట.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ రూపొందించే 'సర్కారు వారి పాట' చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తారట. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇందులోని తారాగణాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇంకో కీలక పాత్రకు మరో ప్రముఖ నటుడిని కూడా తీసుకుంటున్నారట.
*  సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న సంగతి విదితమే. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగ శౌర్య సిక్స్ ప్యాక్ ఫిజిక్ లో కనపడనున్నాడు. ఇందుకోసం నాగ శౌర్య ప్రస్తుతం జిమ్ లో విపరీతంగా వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.