Sanchaita: పవన్ కల్యాణ్ గారు... మా అమ్మ, నాన్న ఇద్దరూ హిందువులే: సంచయిత

Pawan Kalyan garu my mother and father are Sanchaita
  • పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సంచయిత 
  • నా తల్లి హిందూ పురోహిత్ ను రెండో వివాహం చేసుకుంది
  • టీడీపీ ప్రచారాలను మీరు నమ్మొద్దు
మాన్సాస్ ట్రస్ట్ భూములపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాన్సాస్ ట్రస్టు సంప్రదాయాలకు భిన్నంగా ట్రస్టీలను మార్చేశారని, ఇతర మతాలకు చెందిన విషయాల్లో కూడా ఇలాగే చేయగలరా? అని ప్రశ్నించారు. హిందూ వ్యవస్థలపై దాడి చేయడం ఎక్కువైపోయిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతి ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'పవన్ కల్యాణ్ గారు మాన్సాస్ కు హిందూయేతర వ్యక్తి అధినేతగా ఉన్నారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చెప్పారు. కొన్ని నిజాలను నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆనంద గజపతిరాజు, ఉమా గజపతిల కూతురు నేను. నా తల్లిదండ్రులు ఇద్దరూ హిందువులే. నా తల్లి రమేశ్ అనే హిందూ పురోహిత్ ను రెండో వివాహం చేసుకుంది. ఆయన ఆరు జాతీయ అవార్డులు అందుకున్న ఫిల్మ్ మేకర్. ఎమ్మీ అవార్డులకు కూడా నామినేట్ అయ్యారు.

టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. మాన్సాస్, సింహాచలం దేవస్థానాల ఆడిట్ రిపోర్టుల్లో తమ తప్పిదాలు బయటపడతాయనే భయంలో టీడీపీ ఉంది. ఒక హిందువుగా నేను అన్ని మతాలను గౌరవిస్తా. మీ మాటను సవరిస్తూ ఒక ప్రకటన ఇస్తే చంద్రబాబు, ఆయన అనుచరుల ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడుతుంది' అని ట్వీట్ చేశారు.
Sanchaita
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
Mansas

More Telugu News