Varla Ramaiah: విజయసాయిరెడ్డికి 91 సీఆర్పీసీ క్రింద పోలీసులు నోటీసులు ఇస్తారా?: వర్ల రామయ్య

Varla Ramaiah fires on Vijayasai Reddy
  • అంతర్వేది రథానికి నిప్పు పెట్టించింది చంద్రబాబేనన్న విజయసాయి
  • సాక్ష్యాలు కావాలని విజయసాయికి నోటీసులు ఇస్తారా? అని నిలదీసిన వర్ల
  • మన ఎంపీగారే అని ఊరుకుంటారా? అని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు పాపభీతి, దైవభక్తి లేనివాడని... హిందుత్వంపై దాడికి ఆయనే కారణమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడిన సంగతి తెలిసిందే. విజయవాడలో గుడులు కూల్చారని, అమరేశ్వరుడి భూములు మింగారని, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు నిర్వహించారని ఆరోపించారు. అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించింది కూడా చంద్రబాబేనని వ్యాఖ్యానించారు.  

ఈ నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. అంతర్వేది రథానికి నిప్పు పెట్టింది చంద్రబాబు అని ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డికి 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని పోలీసులు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. లేకపోతే మన ఎంపీగారే అని ఊరుకుంటారా? అని ఎద్దేవా చేశారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరొక న్యాయమా? ఇదే మీ ప్రభుత్వ విధానమని దుయ్యబట్టారు.
Varla Ramaiah
Chandrababu
Telugudesam
Vijayasai Reddy
YSRCP

More Telugu News