Varla Ramaiah: మంత్రి కొడాలి నానిపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

TDP leaders complains to Vijayawada police against Kodali Nani
  • విజయవాడ సీపీని కలిసిన వర్ల, అశోక్ బాబు, బచ్చుల
  • కొడాలి నాని భాష అప్రజాస్వామికం అని పేర్కొన్న వర్ల
  • నానిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న బచ్చుల
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు విజయవాడ సీపీని కలిశారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ...  కొడాలి నాని వాడుతున్న భాష అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, నన్ను కూడా చంపేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడాలి నానిపై చర్యలు తీసుకుంటారేమోనని చూశాం కానీ స్పందించలేదని బచ్చుల అర్జునుడు తెలిపారు. మొదట డీజీపీని కలవాలని భావించామని, కానీ డీజీపీ పనిలో ఉన్నారని చెప్పారని, అందుకే విజయవాడ సీపీని కలిశామని వివరించారు. కొడాలి నానిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చర్యలు తీసుకోకపోతే గవర్నర్ ను కూడా కలుస్తామని బచ్చుల స్పష్టం చేశారు.
Varla Ramaiah
Ashok Babu
Bachula Arjunudu
Kodali Nani
Police
Vijayawada
Telugudesam
Andhra Pradesh

More Telugu News