Ajeya Kallam: ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదు: అజేయ కల్లం

  • డిస్కంలు పారదర్శకంగా వ్యవహరిస్తాయని వెల్లడి
  • మీటర్ల బిగింపుతో విద్యుత్ వినియోగంపై స్పష్టత వస్తుందన్న కల్లం
  • కౌలు రైతులకు కూడా ఇబ్బందులు ఉండవని స్పష్టీకరణ
Ajeya Kallam explains money transfer for free current scheme

ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం రాష్ట్రంలో అమలు చేయబోతున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై మీడియా సమావేశంలో వివరించారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంతో ఎవరికీ ఇబ్బంది కలుగదని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో డిస్కంలు పారదర్శకంగా వ్యవహరించేందుకు వీలవుతుందని తెలిపారు. పగలు 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వడానికి సాధ్యపడుతుందని చెప్పారు. తక్కువ ధరకే విద్యుత్ కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తే విద్యుత్ వినియోగంపై స్పష్టత వస్తుందని, విద్యుత్ లోడ్ ఎంత ఉందనేది అర్థమవుతుందని అజేయ కల్లం వివరించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందించే ఫీడర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, వచ్చే రబీ సీజన్ నాటికి ఫీడర్లు అందుబాటులోకి వస్తాయని, తద్వారా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఆస్కారం లభిస్తుందని అన్నారు. కనెక్షన్లకు మీటర్లు బిగించడం వల్ల విద్యుత్ కంపెనీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఇబ్బందులు ఉండవన్న హామీని ప్రభుత్వం ఇస్తుందని అజేయ కల్లం వివరించారు.

More Telugu News