Vellampalli Srinivasa Rao: దాడులు చేయడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబు సంస్కృతి: ఏపీ మంత్రి వెల్లంపల్లి

AP Minister Vellampalli comments on Chandrababu and Pawan Kalyan
  • అంతర్వేదిలో రథం దగ్ధం
  • ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం
  • దాడులు చేసేవారిని క్షమించబోమన్న వెల్లంపల్లి
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 60 ఏళ్ల నాటి రథం దగ్ధం కావడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అంతర్వేది రథం కాల్చివేత చాలా బాధాకరమని తెలిపారు. చర్చి, మసీదు, ఆలయాలపై దాడులు చేసేవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. అంతర్వేది ఘటన జరిగిన వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ సీఎం జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించారని వెల్లడించారు. దాడులు చేయడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబు సంస్కృతి అని, పవన్ కల్యాణ్ లాగా ఓట్ల కోసం రాజకీయాలు చేయడం తమకు తెలియదని వెల్లంపల్లి విమర్శించారు.
Vellampalli Srinivasa Rao
Chandrababu
Pawan Kalyan
Antarvedi
Chariot Burning

More Telugu News