Somu Veerraju: హిందువులను రెచ్చగొట్టే చర్యలు ఏపీలో జరుగుతున్నాయో లేదో ప్రభుత్వమే తేల్చుకోవాలి: సోము వీర్రాజు

  • అంతర్వేదిలో యువకులను, మహిళలను అరెస్ట్ చేశారన్న సోము
  • ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్
  • బీజేపీ నేతలను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని స్పష్టీకరణ
Somu Veerraju responds on Chalo Antarvedi consequences

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాజమండ్రి మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు. చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న యువకులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారని, ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నిస్తే నినాదాలు చేశారన్న సమాధానం వచ్చిందని తెలిపారు. నినాదాలు చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. ఓవైపు రథం కాలిపోయి హిందువుల హృదయాలు గాయడిపతే... నినాదాలతో రెచ్చగొడుతున్నారని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

"ఎవరు రెచ్చగొడుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏపీలో జరుగుతున్నాయో లేదో ప్రభుత్వమే తేల్చుకోవాలి" అంటూ స్పష్టం చేశారు. నిన్న అంతర్వేదిలో అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, అర్ధరాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉంచిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రదేశాన్ని నిన్న ఏపీ మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి ఘటనపై మంత్రులను నిలదీశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

More Telugu News