kangana ranaut: చెప్పినట్లే చేస్తోన్న హీరోయిన్ కంగ‌న‌.. ముంబైకి ప‌య‌నం.. తీవ్ర ఉత్కంఠ‌.. వీడియో, ఫొటోలు ఇవిగో

Actor Kangana Ranaut reaches Mohali International Airport
  • ముంబైకి వెళ్లే ముందు హ‌నుమ‌కు పూజ‌లు
  • జై శ్రీరాం నినాదాలు
  • ముంబైలో కంగ‌నా ఆఫీసు కూల్చివేత‌
  • మ‌రోసారి ముంబైని పీవోకేతో పోల్చిన హీరోయిన్
'ఈ నెల 9వ తేదీన ముంబైకి వ‌స్తాను ద‌మ్ముంటే అడ్డుకోండి' అంటూ ఇటీవ‌ల స‌వాలు విసిరిన హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్  చెప్పిన‌ట్లే చేస్తోంది. భారీ భ‌ద్ర‌త న‌డుమ‌ మొహాలీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి ముంబైకి బ‌య‌లుదేరింది.

అంత‌కు ముందు ఆమె ఇంటి వ‌ద్ద హ‌నుమంతుడికి పూజ‌లు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆమె పోస్ట్ చేసింది. కాగా, ముంబైలోని ఆమె మ‌ణిక‌ర్ణిక కార్యాల‌యంలో బీఎంసీ అధికారులు కూల్చివేత ప‌నులు మొదలు పెట్టారు.

ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆమె పోస్ట్ చేసి మ‌రోసారి ముంబైని పీవోకేతో పోల్చింది. అందుకే తాను ముంబైని పాక్ ఆక్ర‌మిత కశ్మీర్ అని అంటున్నాన‌ని చెప్పింది. కాగా, ఆమె వ‌స్తోన్న నేప‌థ్యంలో ముంబైలోనూ భద్రతను పెంచారు. ఆమె ముంబైలో అడుగుపెట్టాక ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

              
kangana ranaut
Maharashtra
Bollywood

More Telugu News