Sumalatha: డ్రగ్స్ వాడేది చిత్ర పరిశ్రమలోని వారేనా?.. వేలెత్తి చూపకండన్న సుమలత

  • ఇప్పటికే రాగిణి, సంజన తదితరుల అరెస్ట్
  • మంచి, చెడులు ప్రతి రంగంలోనూ ఉన్నాయి
  • దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్న సుమలత
Sumalatha Comments on Sandalwood Drugs Case

మాదక ద్రవ్యాల వ్యవహారం కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుండగా, ఇప్పటికే నటీమణులు రాగిణి, సంజనలతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన లోక్ సభ సభ్యురాలు, నటి సుమలతా అంబరీశ్, కేవలం సినీ పరిశ్రమను మాత్రమే వేలెత్తి చూపవద్దని హెచ్చరించారు. ప్రతి రంగంలోనూ మంచి, చెడులు ఉన్నాయని, డ్రగ్స్ కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే వాడతారా? అని ప్రశ్నించారు.

తాను ఎన్నడూ మత్తుమందులను వాడలేదని స్పష్టం చేసిన ఆమె, యువత విషయంలో మాత్రం వస్తున్న ఆరోపణల్లో కొంత నిజాలున్నాయని అన్నారు. డ్రగ్స్ లేవని తాను చెప్పడం లేదని, లోతైన దర్యాఫ్తు చేస్తే, నిజానిజాలన్నీ వెలుగులోకి వస్తాయని, అప్పటివరకూ వేచి చూడాలన్నదే తన అభిమతమని అన్నారు.

ఎవరి వద్దనైనా డ్రగ్స్ కు సంబంధించిన ఆధారాలు ఉంటే, వాటిని దర్యాఫ్తు సంస్థలకు అందించాలని చెప్పిన సుమలత, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని, కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన, వారిని దోషులుగా చూడవవద్దని సూచించారు. వచ్చిన ఆరోపణలు రుజువయ్యేంత వరకూ ఎవరికి తోచిన విధంగా వారు తీర్పులను ప్రకటించేయడం సరికాదని హితవు పలికారు.

More Telugu News