Rashmika Mandanna: హీరోతో ప్రేమలో పడిందంటూ ప్రచారం.. స్పందించిన హీరోయిన్ ర‌ష్మిక!

rashmika reject love matter
షార్ట్స్‌లో చూడండి
మ‌హేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో పాటు నితిన్  'భీష్మ' సినిమాల్లో న‌టించి వరుసగా హిట్లు కొట్టి ఖుషీగా ఉన్న హీరోయిన్ ర‌ష్మిక ఇటీవల ఓ హీరోతో ల‌వ్ లో పడింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె ఆ వార్త‌ల‌ను ఖండించింది..  త‌నకు తెలిసిన ప్రతి యువ‌కుడి పక్కన త‌న పేరును పెడుతూ ప్ర‌చారం చేసేవారికి తాను ఓ  సమాధానం చెబుతున్నాన‌ని తెలిపింది.

తాను సింగిల్‌గా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌కు  ఒంటరిగా ఉండటం నచ్చిందని చెప్పింది. జీవితంలో ఒంటరిగా, సంతోషంగా ఉండటం తెలుసుకుంటే కాబోయే జీవిత భాగస్వామిపై కూడా అంచనాలు ఇంకా పెరుగుతాయని చెప్పుకొచ్చింది. కాగా, ఈ భామ చేతిలో ఇప్పుడు ప‌లు సినిమాలు ఉన్నాయి.
Go Back to Shorts
Rashmika Mandanna
Tollywood
SarileruNeekevvaru

More Telugu News