Saudi arabia: ‘వాషింగ్టన్ పోస్ట్’ జర్నలిస్ట్ ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష ఖరారు

  • 2018లో టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయంలో ఖషోగి హత్య
  • సౌదీ ప్రభుత్వమే హత్య చేయించిందని ఆరోపణ
  • ఖషోగి కుటుంబం క్షమాభిక్షతో ఉరి శిక్ష నుంచి తప్పించుకున్న ఐదుగురు
Saudi court sentences suspects in Jamal Khashoggi murder

సౌదీ రాకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై తీవ్ర విమర్శలతో కూడిన వ్యాసాలు రాసి హత్యకు గురైన ‘వాషింగ్టన్ పోస్ట్’ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య కేసులో రియాద్ క్రిమినల్ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో ఖషోగి హత్యకు గురికావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది.

 తమపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఖషోగిని సౌదీ ప్రభుత్వమే హత్య చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాకుమారుడు సల్మాన్ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇంటెలిజెన్స్ భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు. అయితే, ఖషోగి కుటుంబం క్షమాభిక్షతో ఈ కేసులో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. దీంతో వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన వారిలో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

More Telugu News