nagababu: రథాన్ని కావాలని తగలబెట్టారా?: నాగ‌బాబు

  • ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా?
  • నిగ్గు తేల్చాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంది
  • ఇది మతానికి సంబంధించిన విషయం
nagababu fires on ycp

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం ఇటీవ‌ల‌ అగ్నికి ఆహుతైన ఘ‌ట‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తో పాటు తదితర సంఘాల కార్యకర్తలు ఆందోళ‌న‌ల‌కు కూడా దిగిన విష‌యం తెలిసిందే. ఆ రథాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రులను కూడా అడ్డుకున్నారు. ర‌థం త‌గుల‌బ‌డిన ఘ‌ట‌న‌పై జ‌న‌సేన నేత నాగ‌బాబు స్పందిస్తూ దోషుల‌కు శిక్ష‌ప‌డేలా చేయాల‌ని డిమాండ్ చేశారు.

"60 సంవత్సరాల చరిత్ర కలిగిన అంతర్వేది రథాన్ని కావాలని తగలబెట్టారా? ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా? నిగ్గు తేల్చాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంది. ఇది మతానికి సంబంధించిన విషయం. దోషులు శిక్షింపబడాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే హిందు వ్యతిరేక ముద్ర పడటం గ్యారంటీ. వైసీపీ ప్ర‌భుత్వం జాగ్రత్త పడాలి" అని నాగ‌బాబు ట్వీట్ చేశారు.

More Telugu News