Astrajenica: నిలిచిపోయిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలు!

  • వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ కు అనారోగ్యం
  • బ్రిటన్ లో పరీక్షలను నిలిపివేసిన ఆస్ట్రాజెనికా
  • పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని ప్రకటన
Oxford Vaccine Trails Stopped in Britain

కరోనా వ్యాక్సిన్ రేసులో మిగతా అన్ని వ్యాక్సిన్ల కన్నా ముందుందని భావిస్తున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన టీకాను వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయాయి. బ్రిటన్ లో టీకా తీసుకున్న వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో, తుది దిశకు చేరిన క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేశామని, వ్యాక్సిన్ భద్రతపై మరోమారు పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సదరు వాలంటీర్ కు ఎటువంటి అనారోగ్య సమస్య ఏర్పడిందన్న విషయాన్ని మాత్రం సంస్థ పేర్కొనలేదు.

  • Loading...

More Telugu News