Kannada: పార్కులో నటి సంయుక్త హెగ్డేపై దాడిచేసిన కవితారెడ్డి అరెస్ట్

Kavitha reddy arrested in samyukhta hegde case
  • స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్క్‌లో వర్కవుట్లు
  • గొడవకు దిగిన కవితారెడ్డి
  • అరెస్ట్ తర్వాత లిఖితపూర్వక క్షమాపణ
కన్నడ నటి సంయుక్త రెడ్డిపై పార్కులో దాడి చేయడమే కాకుండా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కవితారెడ్డి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సంయుక్త ఇటీవల బెంగళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని వ్యాయామం చేస్తుండగా చూసిన కవితారెడ్డి ఆమెను నిలదీశారు. బహిరంగ ప్రదేశంలో స్పోర్ట్స్ బ్రా ధరించి ఈ వర్కవుట్స్ ఏంటంటూ ఆమెతో గొడవ పెట్టుకున్నారు. కవితారెడ్డికి పార్కులోని మరికొందరు మద్దతుగా నిలవడంతో ఘర్షణ మరింత పెద్దదైంది.

సంయుక్త వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. సంయుక్తను నిందించడమే కాకుండా సినిమా వాళ్లందరూ డ్రగ్స్ వాడతారంటూ ఆమెపై దాడికి యత్నించినట్టు కవితారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్కులో జరిగిన సంఘటనతో షాక్‌కు గురైన సంయుక్త కోలుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత సంయుక్తకు లిఖితపూర్వకంగా కవిత బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆమె క్షమాపణలను సంయుక్త స్వీకరించినట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులు మాత్రం విచారణను కొనసాగిస్తున్నారు.
Kannada
Actress Samyuktha Hegde
Kavitha Reddy
park
Bengaluru

More Telugu News