సందేహాలు ఉన్నాయి.. కంగనకు మద్దతుగా ఉంటాం: ముంబై బీజేపీ ఎంపీ
- కంగన కార్యాలయాన్ని కూల్చేస్తామని బీఎంసీ అధికారులు చెప్పారు
- చట్ట విరుద్ధమైన నిర్మాణమైతే కూల్చేయండి
- ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకోబోము
ఎవరికైనా ఏ ప్రభుత్వమైనా అన్యాయం చేయాలనుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని గోపాల్ శెట్టి అన్నారు. కంగనను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా టార్గెట్ చేసిందా? లేక అధికారుల ద్వారా ఆమెపై కక్ష సాధింపులకు దిగిందా? అనే విషయం తేలాల్సి ఉందని చెప్పారు. ఒకవేళ కంగన కార్యాలయం చట్ట విరుద్ధమైన నిర్మాణమైతే దాన్ని కూల్చివేయవచ్చని... అయితే, ఆమెపై చర్యలకు దిగిన సమయం పలు సందేహాలకు తావిస్తోందని అన్నారు. తాను మూడు పర్యాయాలు కార్పొరేటర్ గా, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని... గత ఆరేళ్లుగా ఎంపీగా బాధ్యతలను నిర్వహిస్తున్నానని... ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకోబోనని హెచ్చరించారు.