Andhra Pradesh: ఏపీలో మరోసారి భారీగా కరోనా పాజిటివ్ కేసులు

Once again massive corona positive cases emerges in AP
  • గత 24 గంటల్లో 10,601 కేసులు
  • 73 మంది మృతి
  • 11,691 మందికి కరోనా నయం
ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో 10,601 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, అదే సమయంలో 73 మంది మృతి చెందారు. 11,691 మంది కరోనా నుంచి కోలుకున్నారు తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు గుర్తించారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,17,094కి చేరింది. అటు, ఏపీలో నేటివరకు 4,560 మంది కరోనాతో కన్నుమూశారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో 4,15,765 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 96,769 మంది చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
COVID-19

More Telugu News