IYR Krishna Rao: ఇగో వద్దు.. కేసీఆర్ చేసినట్టే సీఎం జగన్ కూడా చేయాలి: 'పీవీకి భారతరత్న'పై ఐవైఆర్ వ్యాఖ్యలు

IYR Krishnarao suggests YS Jagan to do like what KCR done in assembly
  • పీవీకి భారతరత్న ఇవ్వాలని చాన్నాళ్లుగా డిమాండ్లు
  • నేడు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
  • ఏపీలోనూ తీర్మానం చేయాలన్న ఐవైఆర్
దివంగత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. "సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ అంశంలో స్పష్టమైన నిర్ణయం వెలిబుచ్చారు. మరి మీరెప్పుడు కేసీఆర్ బాటను అనుసరిస్తారు?" అంటూ ఏపీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఇక్కడ ఇగో పట్టింపులు అస్సలు ఉండరాదని, తెలంగాణ తరహాలో ఏపీలోనూ తీర్మానం చేయాలని ఐవైఆర్ హితవు పలికారు.
IYR Krishna Rao
Jagan
KCR
Bharataratna
PV Narasimharao

More Telugu News