Corona Virus: కరోనాతో టీఆర్ఎస్ నేత, ఆదిలాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న మృతి

TRS leader Are Rajanna passes away with corona
  • గత నెల చివరిలో కరోనా నిర్ధారణ
  • తొలుత హోం క్వారంటైన్‌లో.. ఆ తర్వాత ఆసుపత్రి
  • హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రిలో కన్నుమూత
కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ నేత, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆరె రాజన్న (56) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందారు. గత నెల చివరి వారంలో కరోనా సోకడంతో తొలుత కొన్ని రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్న రాజన్న ఆ తర్వాత పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. రాజన్నకు భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన స్వగ్రామమైన ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా (టి) గ్రామంలో నిన్న అంత్యక్రియలు నిర్వహించారు.
Corona Virus
Adilabad District
Are Rajanna

More Telugu News