Bigg Boss: బిగ్ బాస్ లో చేరిన 'గంగవ్వ'... ఆమె పేరిట 'ఆర్మీ' సందడి మామూలుగా లేదుగా!

Gangavva Army Hulchul in Social Media
  • మొదటి వారంలోనే హౌస్ లో హడావుడి
  • గంగవ్వ మెప్పు కోసం కంటెస్టెంట్ల ప్రయత్నాలు
  • ఈ సీజన్ విజేత అయ్యే చాన్సున్న వారిలో గంగవ్వ కూడా
మూడు రోజుల క్రితం ప్రారంభమైన బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-4, ఎన్నో వింతలు, విశేషాలతో నడుస్తోంది. ఆదిలోనే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు కూడా వచ్చేశాయి. ఈ సీజన్ లో ప్రత్యేకంగా కనిపించింది ఎవరైనా ఉన్నారా?అంటే అది 'మై విలేజ్ షో' ద్వారా పాప్యులర్ అయిన గంగవ్వే అనడంలో సందేహం లేదు. కంటెస్టెంట్లలో చిట్టచివరగా హౌస్ లోకి వెళ్లిన ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని, ఆమె మెప్పు పొందాలని మిగతా వారంతా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

 హౌస్ లో అందరికన్నా వయస్సులో పెద్దదైన గంగవ్వను మంచిగా చూసుకుంటూ వీక్షకుల మన్ననలను పొందాలని మిగతా కంటెస్టెంట్లు ప్రయత్నాలు చేస్తుండగా, బయట ఆమె పేరుతో అప్పుడే ఓ ఆర్మీ మొదలైపోయింది. 'గంగవ్వ ఆర్మీ' పేరిట సోషల్ మీడియాలో ఆమె అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ఈ సీజన్ లో ఆమెను విజేతగా నిలుపుతామని అంటున్నారు.

గతంలో ఓ సీజన్ లో కౌశల్ ఆర్మీ పేరిట ఎంత హడావుడి జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో మరికొంతమంది కంటెస్టెంట్లకు మద్దతుగా బయట సైన్యాలు తయారైనా, తొలుత ముందడుగు వేసింది మాత్రం గంగవ్వ ఆర్మీనే. ఇక గంగవ్వకు కూడా ట్విట్టర్ ఖాతా, గంగవ్వ ఆర్మీ మొదలైపోయి, ట్వీట్లు, పోస్టులతో హోరెత్తుతున్నాయి. అంతేకాదు... గంగవ్వ గురించి నేషనల్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఆమె, రాబోయే 15 వారాల పాటు ఎలా హౌస్ లో ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికైతే, ఆమెకు ఆదరణ బాగానే ఉందనడంలో సందేహం లేదు.
Bigg Boss
Gangavva
Gangavva Army

More Telugu News