Chris Gayle: బౌండరీ లైన్ వద్ద క్యాచ్ తీసుకుని క్రిస్ గేల్ సెలబ్రేషన్... ఆపై ట్విస్ట్... వీడియో ఇదిగో!

  • ఈ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్న గేల్
  • ఇప్పటివరకూ 125 మ్యాచ్ లు ఆడిన క్రిస్ గేల్
  • ట్వీట్ కు రిప్లయ్ ఇవ్వాలన్న ఫ్రాంచైజీ 
Chris Gayle Catch Near boundary Line and A twist

ఇదో ఫన్నీ వీడియో... ఈ ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్న డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్, దుబాయ్ లో ప్రాక్టీస్ సందర్భంగా, బౌండరీ లైన్ వద్ద ఓ క్యాచ్ పట్టుకుని, సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే గేల్ బౌండరీ లైన్ దాటేశాడు. తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. అంతే... వెంటనే లైన్ అవతలి నుంచే బాల్ ను మైదానంలోకి విసిరి, లోపలికి వచ్చి, దాన్ని పట్టుకున్నాడు.

 క్రికెట్ నిబంధనల ప్రకారం, అది క్యాచ్ కాదని అందరికీ తెలిసిందే. అయితే, గేల్ చేసిన హడావుడి, క్యాచ్ పట్టిన తరువాత జరిగిన ట్విస్ట్ ను, మైదానం బయట ఉన్న మరో టీమ్ సభ్యుడు చిత్రీకరించాడు. దాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. "దీన్ని సిక్స్ అని అనుకుంటున్నారా?అలా అనుకుంటే, ఈ ట్వీట్ కు రిప్లయ్ ఇవ్వండి" అని కామెంట్ పెట్టింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న గేల్,ఐపీఎల్ తొలి సీజన్ నుంచి, ఇప్పటివరకూ 125 మ్యాచ్ లు ఆడి, 151 స్ట్రయిక్ రేట్ తో 4,484 పరుగులు చేశాడు. 2013 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ, పుణె వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 175 పరుగులు చేశాడు.

More Telugu News